ఒక మహిళ సంతోషపడే క్షణం ఏదన్నా ఉంది అంటే అది కడుపుతో ఉన్నపుడు మాత్రమే. గర్భం దాల్చిన తర్వాత చాలా రకాల బయలు పట్టిపీడిస్తాయి. మొదటి త్రైమాసికం ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తారు ఎందుకంటే మొదటి మూడు నెలలలోనే గర్భస్రావం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మొదటి మూడు నెలలు గడిచి రెండవ  త్రైమాసికం (4 వ నెల నుంచి 6 వ నెలకు ) వచ్చాక హాయిగా ఉంటుంది.  ఈ సమయంలో ఆహార విషయంలో కూడా గర్భిణీకి కొంత ఉపశమనం లభిస్తుంది.ఎందుకంటే మొదటి త్రైమాసికం లాగా వాంతులు, నీరసం వంటివి తగ్గుముఖం పడతాయి.అసలు 2వ త్రైమాసికంలో (4 -6వ నెల) గర్భంలో పిల్లల ఎదుగుదల ఎలా  ఉంటుందో అని చాలా మంది గర్భిణీ స్త్రీలు ఆలోచిస్తూ ఉంటారు.

గర్భంలో పిల్లల ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసుకోవడం మంచిది. నిజంగా చెప్పాలంటే ఇటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల ప్రెగ్నన్సీ సమయంలో గర్భిణికి బిడ్డ ఎదుగుదల గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. రెండవ త్రైమాసికంలో బిడ్డ ఎదుగుదల అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం..! నాల్గవ నెలలో బిడ్డ చేతులు, కాళ్ళ గోర్లు పెరుగుతాయి.గర్భంలోని బిడ్డ ఈ సమయంలోనే  బొటన వేలుని నోట్లో పెట్టుకొని సప్పరించడం మొదలు పెడతాడు.అలాగే ఈ నెలలో తల్లికి కూడా బిడ్డ యొక్క కదలిక కొంచెం కొంచెంగా తెలుస్తుంటుంది. ఈ సమయంలోనే గర్భమావి కూడా పూర్తిగా తయారయి ఉంటుంది. అలాగే ఇంకో విషయం తెలుసా.. మీ బిడ్డ గంట గంటకు పాస్ పోస్తుంటాడు కూడా.ఇంకా ఐదవ నెలలో బిడ్డ కను బొమ్మలు కూడా వచ్చేసి ఉంటాయి.

అంతే కాకుండా వినికిడి శక్తి కూడా బాగా పెరిగుంటుంది.ఈ సమయంలోనే పిల్లలు గర్భాశయంలో ఎక్కువుగా కదలడం మొదలు పెడతారు. సన్నటి జుట్టు కూడా రావడం మొదలవుతుంది.ఆరవ నెలలో పిల్లల కంటి చూపు బాగా పెరుగుతుంది. చీకటిని వెలుతురుని  బిడ్డ గుర్తుపట్టగలడు. బిడ్డ కళ్ళు తెరిచి చూడగలడు. అంతేకాకుండా బిడ్డ తన బొటన వేలితో మిగతా వేళ్ళని రుద్దడం కూడా మొదలవుతుంది.ఈ నెలలో తల్లికి బిడ్డ కదలికలు బాగా తెలుస్తాయి.చూసారు కదా మీ బిడ్డ కడుపులో ఎలా తయారవుతుందో అని.. ఇంకా ఎటువంటి ఆందోళనలు పెట్టుకోకుండా   పుట్టబోయే మీ బిడ్డను తలచుకుని మురిసిపోండి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: