మహిళలు ఆరోగ్య విషయానికి వస్తే ఎందరో మహిళలు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ తో బాధపడే వారిలో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ బాధితులే ఉన్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. క్యాన్సర్ అనగానే ఇక మహిళల మానసిక పరిస్థితి భయంకరంగా మారుతోంది. అందులోనూ రొమ్ము క్యాన్సర్ అయితే మరీ ఎక్కువగా కంగారు పడిపోతారు. నిత్యం ఇక ఈ జబ్బు నుండి ఎలా బయట పడటం, ఎలా దీన్ని ఎదుర్కోవడం...చికిత్స ఎంత భయంకరంగా ఉంటుందో అని మానసికంగా కృంగిపోతుంటారు. తద్వారా మానసిక ఒత్తిడి పెరిగి వారి ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తూ ఉంటుంది. సమస్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇటువంటి వారికి మనోధైర్యాన్ని పెంచి వారిలో జీవితం పట్ల మళ్ళీ సంతోషకరమైన ఆశలు చిగురించేలా చేసివారి మానసిక స్థితిని కుదుట పరచడానికి "ఉషా లక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్" తన వంతు సాయం చేస్తోంది.
 
ఈ ఫౌండేషన్ ద్వారా రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి  ఒక హెల్ప్ లైన్ నెంబర్ (08046983383) ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే రొమ్ము క్యాన్సర్ ను జయించి ఆ మహమ్మారి నుండి బయటపడిన వారిని ఒక చోట చేర్చి శిక్షణను ఇచ్చారు. ఈ నంబర్ కు కాల్ చేసిన బాధితులకు మానసిక ధైర్యాన్ని పెంచే విధంగా వారు ఎలా దృఢంగా సమస్యని  ఎదుర్కొని అందులో నుండి బయటపడ్డారో మరియు వాటి వివరాలు తెలియచేసి బాధితులను మానసికంగా చైతన్య పరిచే వారిలో ధైర్యం పెంచే విధంగా ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ బాధితులు ఈ నంబర్ కు  కాల్ చేస్తే చాలు, వారిలో భరోసా నింపేందుకు వీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, మొదట మీరు కాల్ చేయగానే భాషను ఎంపిక చేసుకోమని ఒక్కో భాషకు ఒక్కో నంబరు చెబుతూ సూచన వస్తుంది. అలా తొలుత మీ భాషను ఎంపిక చేసుకోవాలి.

* మీరు జాగ్రత్తగా విని మీ సమస్యకు తగిన నంబర్ ను ఎంచుకోవాలి..దానిని బట్టే బాధితుల ప్రాథమిక సమాచారం వారి దగ్గర సేవ్ అవుతుంది.


* అనంతరం  ఉషా లక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ నుండి ఎంపికై క్యాన్సర్‌ జయించిన వారు 24 గంటల్లో బాధితులకు తిరిగి ఫోన్‌ చేస్తారు. వారితో మీ సమస్యను కనుక చెప్పినట్లు అయితే వారు మీ క్యాన్సర్ కు సంబంధించిన పూర్తి వివరాలను, ఆ వ్యాధిపై అవగాహనను  కల్పించి, మీలో ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తారు.

* అయితే ఇక్కడ వారు చెప్పే వన్ని నిజంగా వారు అనుభవించినవే కానీ బాధితులకు ఎదో మాట చెప్పి ఓదార్చడానికి కాదు. ఒకవేళ మరీ అంత అవసరం అనిపిస్తే బాధితులను సైకాలజిస్టులతో మాట్లాడించి వారికి మరింత మనోధైర్యం పెంచి మానసికంగా దృఢం చేస్తారు.

* ఇప్పటికే 25 మంది సైకాలజిస్టులకు  ఈ అంశంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. వారు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు మానసికంగా బలోపేతం చేయడమే కాకుండా, ఆహారపరమైన సూచనలు కూడా అందిస్తారు.

ఇంకెందుకు ఆలస్యం మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని తెలియచేసి మానసికంగా ఆ వ్యాధి నుండి బయటపడేలా సహాయం చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: