రాయల్ ఎన్ఫీల్డ్.. ఎంతోమంది మధ్యతరగతి యువకుల కల ఇది.. కొనాలి అని ఉన్న సరే.. ధర చూసి వెనకడుగు వెయ్యాలి.. ఎందుకంటే మధ్య తరగతి తండ్రి 4 నెలలు సంపాదన ఆ బైక్ ఖరీదు. అయినప్పటికీ ఆ బైక్ ని చూడటానికి.. ఆ బైక్ లో వచ్చే కొత్త మోడల్స్ చూడటానికి యువకులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. 

 

ఇంకా అసలు విషయానికి వస్తే మనదేశంలో అమ్మాయిల నుండి అబ్బాయిల వరుకు ప్రతి ఒక్కరు ఇష్టపడే దేశీయ దిగ్గజ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి త్వరలోనే మరో కొత్త బైకు వస్తుంది. ఆ బైక్స్ చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఆలా ఉన్నాయి ఆ బైక్స్. అసలు ఆ బైక్ ఏంటి అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్న.. 

 

రాయల్ ఎన్ ఫీల్డ్ మీటియర్ ఫైర్ బాల్ 350.. ఎంతో అద్భుతమైన ఈ బైక్ త్వరలోనే విడుదల కానుంది.. ఇంకా బైక్ మోడల్ ఎంత బాగుందో ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం లేదు.. ఇప్పటికే ఈ బైక్ లాంచ్ అవ్వాల్సింది.. కానీ కరోనా వైరస్ కారణంగా కాస్త ఆలస్యం అయ్యింది. అయితే ఎం ఇప్పుడు విడుదల అవుతుంది.. సంతోషించాలి.. ఇంకా అలాంటి ఈ బైక్ ధర, ఫీచర్లు ఏంటో ఓ సరి చూసేద్దాం. 

 

ఇంకా ఈ బైక్ ధర రూ.1,68,550లు ఉండనుంది అని సమాచారం.. ఇంకా ఈ బైక్ మోడల్, బరువు పోల్చి చూస్తే ఎంతో పవర్ ఫుల్ గా పనిచేయనుంది.. ఇంకా ఈ బైక్ 346సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇంకా ఈ బైక్ ప్రత్యేకతలు ఏంటి అంటే? రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మీటియర్ ఫైర్ బాల్ లేటెస్ట్ అప్డేట్ తో రానుంది. ఏది ఏమైనా రాయల్ ఎన్ ఫీల్డ్ ప్రియులకు ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: