ఆడీ ఏ4 వాహనం 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.3 సెకండ్లలోనే అందుకుంటుంది. ఈ ఏడాది మొదటగా అమ్మకానికి వెళ్తున్న ఆడీ ఏ4 కారు ఆకట్టుకుంటోంది. భారత మార్కెట్లో ఈ వాహనానికి పోటీగా బీఎండబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెజ్ బెంజ్ సీ-క్లాస్, జాగ్వర్ ఎక్స్ఈ లాంటి కార్లు ఉన్నాయి.ఇందులో ఎల్ఈడీ ఫాగ్ ల్యాపులు. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు క్లస్టర్ తో పాటు రియర్ బంపర్, డ్యూయల్ ఎక్సాహాస్ట్ ను కలిగి ఉంది. ఇవి కాకుండా ఆల్ డిజిటల్ వర్చువల్ కాక్ పిట్, అతెపిదెద్ 10.1 అంగుళాల ఎంఎంఐ టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా యాపిక్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ లాంటి తదిత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ఫ్రంట్ వైపు హెక్సాగోనల్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లను ఈ మోడల్ కలిగి ఉంది.
ఈ సరికొత్త ఆడీ ఏ4 సెడాన్.. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కస్టమర్లు సెడాన్ గురించి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వాహనాన్ని బుకింగ్ చేసుకోవడానికి 2 లక్షలను బుకింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా బుకింగ్ చేసుకున్నవారికి ఈ సెడాన్ ను త్వరలో ఆడి కంపెనీ డెలివరీలు చెయ్యనుంది.. ఇక ఇలాంటి మరెన్నో ఆటో న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి