ప్రస్తుత మార్కెట్ లో నిస్సాన్ మ్యాగ్నెట్ కార్స్ సరికొత్త రికార్డులను బ్రేక్ చేసింది.. రెండు మోడల్స్ ను మాత్రమే విక్రయిస్తుంది. వీటి ఆకర్షణీయమైన డిజైన్, రీజనబుల్ ధర కారణంగా మార్కెట్లో ఎస్ యూ వీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఈ మోడల్ కోసం 33000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి దీన్ని వెయిటింగ్ పీరియడ్ 6 నుంచి 8 నెలల వరకు ఉంది. ఈ నేపథ్యంలో నిస్సాన్ మ్యాగ్నెట్ కోసం వస్తున్న డిమాండ్ ను తగ్గించడానికి కంపెనీ తన చెన్నై ప్లాంట్ లో అదనంగా మరో 1000 మంది సిబ్బందిని నియమించుకొని మూడవ షిఫ్ట్ ను కూడా ప్రారంభించింది.



ఇలా చేయడం వల్ల కార్ల కోసం వెయిట్ చేసే పని తగ్గుతుందని అంటున్నారు. షో రూం లో ఈ కారు ధర 5.49 లక్షలు గా ఉంది. బెంగుళూరుకు చెందిన సన్నీ నిస్సాన్ డీలర్ షిప్ ఒక్కరోజులోనే 100 మాగ్నైట్ డెలివరీలు ఇచ్చి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ కారుకు ఇప్పుడు మార్కెట్ లో మంచి  డిమాండ్ ఉంది. ఐదు వేరియంట్ కలర్స్ లో ఈ కారు అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్ లో అన్నీ కలర్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది. 
 


ఎస్యువి లో 8- ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, +టచ్ స్క్రీన్, వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బిల్ట్ ఇన్ వాయిస్ రికాగ్నేషన్, 7- ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్, వెల్కమ్ యానిమేషన్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టం వంటి ఫీచర్లు ఉన్నాయి. నిస్సాన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ, నిస్సాన్ కనెక్ట్ ద్వారా 50 రకాల ఫీచర్లను కనెక్ట్ చేసుకోవచ్చు..డామినేటింగ్ ఫ్రంట్ గ్రిల్ తో అదరగొడుతుంది. జియో ఫెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్, స్మార్ట్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి. కస్టమర్ అవసరానికి తగినట్లుగా వాహన దారుడు మార్చుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: