జనాలను ఆకట్టుకోవడానికి ఎన్నెన్నో ఆఫర్లను అందిస్తున్నారు.. ఈ ఏడాది లో కార్ల కంపెనీలు ఒకదాని మించి మరొకటి అదిరిపోయే ఆఫర్లను అందించింది..దసరా దీపావళికి మాత్రం ఈ ఆఫర్లు ఓ రేంజులో ఆఫర్లను అందించాయి. కళ్లు జిగేల్ మన్న ఆఫర్లను అందిస్తున్నారు. ఇప్పుడు  కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అసలు విషయానికొస్తే ఈ ఏడు ఆఫర్ల తో పాటుగా అదిరిపోయే రేటింగ్ ను అందుకున్న కార్లు మార్కెట్లో ఎవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం....


కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటు లో ఉంది. ప్రముఖ దేశీ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ కొనుగోలుదారులకు తక్కువ ఈఎంఐ తోనే కొత్త కారు ఇంటికి తీసుకెళ్లే ఛాన్స్ కల్పిస్తోంది. టాటా మోటార్స్ వెబ్‌సైట్ ప్రకారం.. టాటా టియాగో కారును నెలకు కేవలం రూ.3,555 ఈఎంఐతో ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ కారు ధర రూ.4.85 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. ఈ రెండు వివరాలను మాత్రమే కంపెనీ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.


టాటా టియాగో కారు కారు కొనుగోలు చేయాలని భావించే వారు టాటా మోటార్స్ వెబ్‌సైట్‌కు వారి పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఇచ్చి కాల్ బ్యాక్ కోసం రిక్వెస్ట్ చేయాలి. అనంతరం కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు. మీరు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. నెలకు రూ.3,555 ఈఎంఐ అంటే.. ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి?.. ఎన్ని నెలలు ఈఎంఐ చెల్లించాలి? రుణం ఎవరిస్తారు? వడ్డీ రేటు ఎంత? వంటి వివరాలు మాత్రం కంపెనీ తెలియజేయడం లేదు. కాగా టాటా టియాగో కారు ధర గరిష్టంగా రూ.6.84 లక్షలుగా ఉంది. .. అన్నీ ట్యాక్స్ లతో పోలిస్తే ఇంకా ఎక్కువగానే అంటున్నారు. ఇలా కారు తీసుకోవడం చాలా మంచిదని కొందరు అభిప్రాయ పడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: