రాజకీయాలు రోజు రోజుకూ దిగజారిపోతున్నాయి. ఈ మాట తరచూ చెప్పుకుంటూనే ఉంటాం. కానీ.. ఈ దిగజారుడు ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పలేని దుస్థితి నెలకొంది. ప్రత్యేకించి అధికారంలో ఉన్న పార్టీలు.. విపక్షాల ఎమ్మెల్యేలకు వల వేయడం సాధారణంగా మారింది. తాజాగా  మణిపూర్ లో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ బుట్టలో వేసుకుంది. తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కోవడం పై జేడీయూ తీవ్రంగా మండిపడుతోంది.


బీజేపీ ధనబలంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడుతోందని జేడీయూ ఆరోపించింది. గతంలో దిల్లీ, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో చేసినట్లుగానే ఇప్పుడు మణిపూర్ లోను ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ మండిపడుతున్నారు. సరిగ్గా జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే భారతీయ జనతా పార్టీ ఈ షాక్ ఇవ్వడం విశేషం. మణిపూర్‌లో జేడీయూకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp