తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతుల ధరలు పెంచడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. ప్రభుత్వం ధరల పెంపుదలే పరమావధిగా మార్చుకుందని సోమువీర్రాజు విమర్శించారు. వసతి గదుల ధరలను రెట్టింపు కాదు మూడు రెట్లు పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తుమని సోము వీర్రాజు అన్నారు. తిరుమల తిరుపతిలో ప్రస్తుతం ఉన్న వసతి సౌకర్యాలను మెరుగుపరిచామనే సాకుతో ధరలు పెంచడం ఎంత వరకు న్యాయమో భక్తులకు సమాధానం చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.


తిరుమలలో గదుల ధరలను ఆకాశాన్ని అంటే రీతిలో పెంచేశారని సోము వీర్రాజు ఆవేదన చెందారు. రూ.150 ధరలు ఉన్న ఒక్కో గదిని రూ.1700 పెంచారన్న సోము వీర్రాజు.. మధ్యతరగతి, సామాన్య భక్తులు ఇంత భారం భరించలేరన్నారు. హిందూ దేవాలయాల్లో మాత్రమే ధరలు పెంచడానికి ఉన్న ప్రభుత్వంగా వైసీపీ కనపడుతోందని సోము వీర్రాజు ఆరోపించారు. తిరుమల విషయంలో పాలకమండలి ధర్మంగా వ్యవహరించకుండా  దర్శనానికి వచ్చే భక్తులను ముక్కుపిండి వసూలు చేసే విధంగా ధరలను ఆమాంతం పెంచేశారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ 4 లో ఒక్కో గది రూ. 750 నుండి  రూ.1700 పెంచారంటే పాలక మండలి కాఠిన్యం  హిందువులకు అర్ధం అవుతోందని సోము వీర్రాజు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: