వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌ను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో నిన్న కేబినెట్ భేటీ అయింది. 2023 - 24 రాష్ట్ర వార్షిక ప్రణాళికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించింది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికశాఖ అధికారులు వివరించగా.. ఆదాయ, వ్యయాల వివరాలను సమర్పించారు. బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వ ప్రాధాన్యాలు, నిధుల కేటాయింపు, తదితరాలకు సంబంధించి మంత్రులకు సీఎం కేసీఆర్ మార్గనిర్ధేశం చేసేశారు.


నాలుగు కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 1200 కోట్లు... హైదరాబాద్ లోని మూడు ఆసుపత్రుల నిర్మాణం కోసం 2800 కోట్ల రూపాయలు అప్పు ద్వారా సమీకరించుకుంటారని తెలుస్తోంది. అలాగే భద్రాచలం, సారపాక, రాజంపేట గ్రామపంచాయతీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: