పెదువులు.. ముఖానికి ఎంత అందాన్ని ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత అందాన్ని ఇచ్చే పేదలు రంగుమారి  ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి ఈ పేదలు అందంగా ఆరోగ్యంగా కనిపించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

గులాబీ నీటితో చర్మానికి స్వాంతన అందుతుంది. దీని వల్ల మృదువుగా, తేమగా మారుతాయి. ఈ నీరు సహజ సిద్ధంగా పెదవులకు లేత గులాబీ రంగును అందిస్తుంది. 

 

గులాబీ నీరలో కాస్త తేనె కలిపి పెదాలకు రాయాలి. రోజూ ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలోనే మంచి మార్పు ఉంటుంది.

 

దానిమ్మ గింజల రసం పొడిబారిన పెదాలకు పోషణను ఇచ్చి తేమను కూడా అందిస్తుంది. పెద్ద చెంచా చొప్పున దానిమ్మ రసం, క్రీమ్‌, గులాబీ నీరు తీసుకుని అన్నింటినీ పెదాలకు పూతలా రాసి కొన్ని నిమిషాలపాటు మృదువగా మర్దన చేయాలి. ఇలా చెయ్యడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. 

 

బీట్‌రూట్‌ పెదవులపై ఉండే మరకలను మాయం చేస్తాయి. తాజా బీట్‌రూట్‌ రసాన్ని పెదాలకు రాత్రుళ్లు రాసుకుని ఉదయమే కడిగేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల మీ పెదాలు లేత ఎరుపు రంగులోకి మారిపోతాయి. 

 

ప్రతిరోజూ కీరదోస ముక్కతో పెదాలపై బాగా రుద్దాలి. ఆ రసం పెదాలు పీల్చుకుంటాయి. ఇలా ప్రతిరోజూ అయిదు నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ పెదవులకు సహజసిద్ధమైన రంగును తీసుకొచ్చేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: