చిన్న పిల్లలను మొదలుకొని పెద్ద వాళ్ళ వరకూ ఈ పేలు తలలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ పేన్ల కారణంగా తలలో విపరీతమైన దురద పెడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ పేన్లు మరీ ఇబ్బంది పెడుతుంటాయి. పిల్లలు చదువుకునేటప్పుడు వారి దృష్టంతా తలలో పేన్ల పైనే ఉంటుంది. ఇక చదువుపై వారు ఏకాగ్రత చూపలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే రోజు రానే వచ్చింది. ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటిస్తే కేవలం రెండు నిమిషాల్లోనే తలలో పేన్ల ను నాశనం చేయొచ్చు.
ఒక బౌల్ లోకి ఒక పావు కప్పు నీటిని తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి, ఆ తర్వాత వైట్ వెనిగర్ పావు కప్పు తీసుకోవాలి. మొత్తం మిశ్రమంలా తయారుచేయాలి. ఒకవేళ మీ దగ్గర మైక్రో వేవ్ ఉంటే 30 సెకండ్లు వేడి చేయండి . లేదంటే డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఒక వెడల్పాటి గిన్నెలో నీటిని బాగా మరిగించి, అందులో ఈ మిశ్రమం ఉన్న బౌల్ ని ఉంచి గోరువెచ్చగా వేడి చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉప్పు నీటిలో బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మీ ఇంట్లో ఒక స్ప్రే బాటిల్ ఉంటే దానిలో భద్రపరుచుకోవచ్చు.
ఇక ఈ మిశ్రమాన్ని మాడుపై స్ప్రే చేస్తూ, మాడు తోపాటు జుట్టు మొత్తం బాగా పట్టించండి. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే కాటన్ బాల్ ని తీసుకొని ఆ మిశ్రమంలో అద్ది తలమాడుకు మొత్తం పట్టించండి. అరగంట ఆరిన తర్వాత కొబ్బరి నూనె కానీ ఆలీవ్ ఆయిల్ కానీ అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో మైల్డ్ షాంపూ వేసి తలస్నానం చేయాలి.
వైట్ వెనిగర్ తలలో పేన్లు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆసిడిక్ యాసిడ్ స్కాల్ఫ్ ను శుభ్రపరుస్తుంది. ఈ చిట్కాలు పాటించి,రెండు రోజుల్లోనే మీ సమస్యను తగ్గించుకోవచ్చు.ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే వారానికి మూడుసార్లు చొప్పున 15 రోజులు క్రమం తప్పకుండా వాడితే మీ తలలో పేన్లు ఒక్కటి కూడా కనిపించవు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి