తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన మరో హామీను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న మరో రెండు పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు రూ. 2500 రూపాయల పథకం అలాగే పెన్షన్ రూ .4000 రూపాయల పెంపు ప్రకటన పైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈమెరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ ప్రకటన చేసే విధంగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం.



ఈనెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 20వ తేదీన తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఆదివారం రోజు కూడా సభ నడపాలని బిఏసిలో నిర్ణయించుకున్నట్లు వినిపిస్తున్నాయి. కానీ ఉగాదికి, శ్రీరామనవమి, రంజాన్ వంటి పండుగలకు సెలవు ప్రకటించారు. ఈనెల 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో పెండింగ్ హామీలను  అమలు చేయాలని ఒక కీలకమైన ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.


ఇందులో భాగంగానే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతినెల రూ. 2500 రూపాయలు అలాగే పెన్షన్ ని రూ .4000 వేల రూపాయలు ప్రకటన చేసే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా కొత్త సంక్షేమ పథకాలు ,నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, తెలంగాణ అభివృద్ధి వంటి అంశాల పైన ప్రత్యేక దృష్టి పెట్టనన్నారు. వాస్తవంగా సంక్రాంతి సమయంలోనే ఈ రెండు పథకాలు అమలుపైన ప్రత్యేకించి ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణం చేత కొంత ఆలస్యమైనట్లు వినిపిస్తోంది. త్వరలోనే జెడ్పి ఎన్నికలతో పాటుగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో సంక్షేమంతో పాటుగా పెండింగ్ ఉన్న హామీలను అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరి ఉగాదికి ఎలాంటి గుడ్ న్యూస్ చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: