చలికాలం వచ్చిందంటే చాలు,చర్మం పొడిబారినట్లు అవ్వడం, లేదా చర్మం పాలిపోయినట్లు అవ్వడం, అంతేకాకుండా దురద పెట్టడం,మంటపుట్టడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం ఎన్నో రకాల వ్యాసిలీన్ లను వాడినప్పటికీ,శాశ్వత పరిష్కారం దొరకదు. అయితే ఏది వాడినా తాత్కాలికంగా మాత్రమే ప్రయోజనాన్ని చేకూర్చుస్తాయి. అంతేకాకుండా చలికాలంలో చర్మం మీద దురద,మంట పుట్టడం లాంటి సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించి,చర్మ సమస్యలను దూరం చేసుకుని, తాజాగా ఉండవచ్చు. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
గుప్పెడు బాదం పప్పులను, రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్ట్ చేయాలి. అయితే తొక్కతో సహా పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమానికి,ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి,పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇక ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముఖం మీద ఎటువంటి గుల్లలు, మచ్చలు,గీతలు ఉన్నా అన్నీ పోతాయి. ఇక అంతే కాకుండా ఈ ప్యాక్ చర్మాన్ని లోపల నుంచి కణాలు తెల్లబడే లాగా చేస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకుని, అందులో కొద్దిగా అలోవెరా జెల్ తో పాటు ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలు అన్నీ కలిపి బాగా మిశ్రమంలా, పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20 నిమిషాల పాటు ఆరానివ్వాలి. అయితే ఈ ప్యాక్ వేసుకొన్న తర్వాత నీటితో కడగకూడదు. కేవలం ఒక కాటన్ క్లాత్ తీసుకుని, చల్లని నీటిలో అద్ది సుతిమెత్తగా తుడిచి వేయాలి. ఇక ఈ ప్యాక్ వేసుకున్న మరుసటిరోజు మాత్రమే సబ్బుతో కడుక్కోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అంది, చర్మం తాజాగా నిగనిగలాడుతూ ఉంటుంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు ఐస్ క్యూబ్ తో ముఖం పైన మసాజ్ చేసి, అరటిపండు తొక్కతో మర్దనా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి