బ్యూటీ టిప్స్ పాటించడానికి కూడా వయసు అవసరమా? అనే సందేహం కలుగుతోందా? అవునండి.. శరీరంలో వచ్చే మార్పులతో పాటు వాతావరణంలో కలిగే మార్పుల వల్ల కూడా మన వయసు పెరుగుతున్న, కొద్దీ మార్పులు సంభవించడం సహజం. అయితే కొన్ని రకాల బ్యూటీ టిప్స్ అన్ని వయసుల వారికి సరిపడ తాయని చెప్పలేము. కొన్ని సౌందర్య చిట్కాలు అన్ని వయసుల వారికి సెట్ అయితే, మరికొన్ని సౌందర్య చిట్కాలు కేవలం వారికి కేటాయించిన పరిమితం వయసు కలిగిన వారికి మాత్రమే సెట్ అవుతాయి. అయితే ఏ వయసు వారు ఎలాంటి బ్యూటీ టిప్స్ పాటించాలి, వాటి వల్ల ప్రయోజనం ఏమిటో? ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నపిల్లల కోసం :
చిన్న పిల్లలు సహజంగానే అందంగా ఉంటారు. ప్రస్తుత కాలం అమ్మలు వారి బిడ్డలు ఇంకా అందంగా ఉండాలని, మార్కెట్లో దొరికే కొన్ని రసాయనాలు కలిగిన క్రీముల తీసుకొచ్చి రాస్తుంటారు. కానీ వాటివల్ల పిల్లలు ఇబ్బంది పడతారు, అన్న విషయం గుర్తు ఉండదు పాపం. ఫలితంగా ఏవో చర్మ సమస్యలు వచ్చి పడుతుంటాయి. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే,ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో తయారు చేసుకునే సున్నిపిండి రాయడం ఉత్తమం. సున్నిపిండి వల్ల పిల్లలు అందంగా ఆరోగ్యంగా పెరుగుతారు.
15 నుంచి 20 సంవత్సరాల అమ్మాయిల కోసం :
టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయిలు కనీసం రోజుకు మూడుసార్లు వేడి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
టోనర్ ని తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం రైస్ వాటర్ చాలా మంచిది. అలాగే దోసకాయ గుజ్జు కూడా.
ఇక జ్యూస్ విషయానికొస్తే,ద్రాక్ష, ఆపిల్,నారింజ,నిమ్మ రసం లాంటివి తరచూ తాగాలి. ఇది తాగడం వల్ల కడుపు శుభ్రం అయ్యి, మొటిమలు రాకుండా ఉంటాయి.
కోడిగుడ్డు తెల్లసొనలో మూడు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఆగి,చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా, మచ్చలు లేకుండా మొటిమలు రాకుండా ఉంటుంది.
20 నుంచి 40 సంవత్సరాల మహిళల కోసం :
ఈ వయసులో మొటిమలు, కళ్ళ కింద నల్లని మచ్చలు, ముడతలు అధికంగా కనిపిస్తాయి. ఒక మూడు చెంచాల టొమాటో రసంలో,తేనె కలిపి ముఖానికి రాసి,పది నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
కళ్ళ కింద మచ్చలు తొలగిపోవాలంటే,ముందు సరైన నిద్ర అవసరం, మూడు లీటర్ల నీళ్లు తాగాలి.అలానే ఒక ఆలుగడ్డ రౌండ్గా కోసి కళ్ళ కింద ఉంచుకోవాలి. ఇలా వారానికి 2 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి