ప్రతి ఒక్కరూ అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. అందులో భాగంగానే మార్కెట్లో దొరికే ఎన్నో రకాల కాస్మెటిక్స్, క్రీమ్స్ ను ఉపయోగిస్తూ వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం,  సకల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక అంతేకాకుండా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూడా అందం రెట్టింపు చేసుకోవడం కోసం ఎన్నో చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఇక అందులో భాగంగానే ప్రతి ఒక్కరు వారి చర్మ తత్వానికి అనుగుణంగా కొన్ని చిట్కాలను పాటిస్తూ అందంగా తయారవుతున్నారు..


అయితే ఈ చిట్కాలు వల్ల మచ్చలు, మొటిమలు తొలగిపోయినప్పటికీ ముఖం మీద జిడ్డు మాత్రం తొలగిపోవడం లేదు..ఇక ఈ జిడ్డు కారణంగా ఎంత మేకప్ వేసుకునప్పటికీ క్షణాల్లో మాయం అయిపోతుంది.. మరేమో ఈ జిడ్డు ఎక్కువగా ఏర్పడడం వల్ల ముఖం, మెడ నల్లగా మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు.. అయితే ఈ సమస్యను తొలగించుకోవాలంటే కొన్ని చిట్కాలను తప్పకుండా ఉపయోగించాలి అంటున్నారు సౌందర్య నిపుణులు.. అయితే ఆ చిట్కాలు ఏమిటో, వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


దీని కోసం ముందుగా ఒక ఆపిల్ తీసుకొని, దానిని పీలర్ సహాయంతో తొక్కను తొలగించాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి,ఆ ఆపిల్ ముక్కలను మిక్సీలో వేసి, మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. ఇక ఆ తరువాత దీనికి ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి, ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, అర టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిశ్రమములా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో ఎక్కడ నల్లగా ఉందో అక్కడ అప్లై చేయండి. ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారానికి నాలుగు నుండి ఐదు సార్లు చేస్తే, మూడు నెలల్లోనే చక్కటి ఫలితం లభిస్తుంది.. అయితే అందరికీ ఆపిల్ అందుబాటులో ఉంటుందని చెప్పలేము కాబట్టి, అందుబాటులో లేనివారు ఆపిల్ కి బదులుగా బంగాళదుంపను కూడా ఉపయోగించుకోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: