సాధారణంగా అమ్మాయిల ముఖ చర్మతత్వంతో పోలిస్తే, పురుషుడి చర్మం కఠినంగా ఉంటుంది. ఇక పురుషుల సంరక్షణ విధానం కూడా భిన్నంగానే ఉంటుంది. అయితే సాధారణంగా అందం అనేది అటు అబ్బాయికి ఇటు అమ్మాయికి ఇద్దరికీ అతి ప్రధానమైనది కాబట్టి అబ్బాయిలు కూడా  వారి చర్మం కోమలంగా , తాజాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే వేసవిలో అబ్బాయిల చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ పద్ధతులు పాటించడం వల్ల మీరు కూడా అందంగా, తాజాగా  కనిపిస్తారు..


చాలా మంది పురుషులు ముఖంపై శ్రద్ధ చూపించరు. దీంతో చర్మం జిడ్డుగా , కఠినంగా తయారవుతుంది. ఇలాంటి కఠినమైన చర్మాన్ని మృదువుగా చేయడానికి రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ రోజు వాటర్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం పై ఉన్న దుమ్ము , ధూళి సులభంగా తొలగించబడతాయి..

అలాగే మీ చర్మ తత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్ ను వాడితే మంచిది. దీనిని కూడా బయటికి వెళ్లేముందు అలాగే ఇంట్లో ఉన్నప్పుడు, రాత్రి నిద్రపోయేముందు కూడా కచ్చితంగా ఉపయోగించాలి.

ఇక సన్స్క్రీన్ లోషన్ ను  తప్పకుండా వాడాలి. చర్మాన్ని ఎండ దెబ్బ నుండి రక్షించడానికి ఎండలో బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ లోషన్ ను ఖచ్చితంగా ఉపయోగించాలి.

తగినంత నిద్ర కూడా చాలా అవసరం. మంచి నిద్ర వల్ల శరీర ఆరోగ్యం, ముఖంలో తేజస్సు రెండు పెరుగుతాయి. అంతేకాకుండా నిద్రలేమి వల్ల ముఖంలో ముడతలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.

ఇక తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించడం ఎంతో అవసరం . ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్ల రసాలు, పాలు మీ డైట్ లో ఉండే విధంగా చూసుకోవాలి..


అంతేకాకుండా రోజు పచ్చి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇంకా షేవింగ్ తర్వాత ఆలివ్ ఆయిల్ తో ముఖాన్ని ఐదు నిమిషాలు మసాజ్ చేయడం వల్ల చర్మం మరింత మృదువుగా తయారవుతుంది..


ప్రతిరోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది . అలాగే శరీరంలో అన్ని టాక్సిన్స్ తొలగిపోయి, ముఖం పై గ్లో వస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: