ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది పెదాలు కూడా నల్లగా మారడం, పెదాలు పొడిబారడం, పగలడం ఇంకా అలాగే పెదాలు అందవిహీనంగా మారడం వంటి వివిధ రకాల సమస్యలతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు.ఒక సింపుల్ హోమ్ టిప్ ని ఉపయోగించి మనం పెదవులను అందంగా, ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల పెదవులు సహజ సిద్దంగానే ఎర్రగా కనిపిస్తాయి. పెదవుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ టిప్ ఏమిటి..తరువాత దీనిని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ టమాట రసాన్ని తీసుకోని ఆ తరువాత ఒక టీ స్పూన్ బీట్ రూట్ రసాన్ని అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా రోజ్ వాటర్ తో పెదవులను బాగా శుభ్ర పరుచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుని సాఫ్ట్ గా మర్దనా చేసుకోవాలి.


ఒక 4 నిమిషాల పాటు ఇలా మర్దనా చేసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.ఒక 20 నిమిషాల తరువాత దూదితో పెదవులను శుభ్రంగా బాగా తుడుచుకోవాలి. పెదాలని నీటితో కడగకూడదు. ఇలా శుభ్రం చేసిన తరువాత ఏదైనా పెట్రోలియం జెల్లీని మీరు మీ పెదవులకు రాసుకోవాలి. ఈ టిప్ ని మీరు రాత్రి పడుకునే ముందు వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల పెదవులపై ఉండే నలుపు ఈజీగా పోతుంది. పెదవులపై ఉండే మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోతాయి.ఇంకా అలాగే మీ పెదవులు సహజంగానే ఎర్రగా ఇంకా కాంతివంతంగా తయారవుతాయి.ఇక పెదవులు అందవిహీనంగా ఉన్నాయి అని బాధపడే వారు ఖచ్చితంగా ఈ విధంగా ఈ టిప్ ని రెగ్యులర్ గా వాడడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: