చాలా మందికి కూడా చాలా కారణాల వలన జుట్టు  రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలిపోతూ ఉంటే మానసికంగా కూడా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇందుకోసం ఖరీదైన షాంపూలతో పాటు సెలూన్స్ కి వెళ్లి హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా మంచి విషయమే అయినా కానీ కొన్ని రకాల టిప్స్ పాటిస్తే మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టకుండా అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఇంకా అలాగే హెడ్ బాత్ చేసే ముందు కొన్ని టిప్స్ పాటిస్తే.. హెయిర్ ని చాలా అందంగా మెరిసేలా చేస్తుంది.తల స్నానం చేయడానికి ముందు ఖచ్చితంగా ఎప్పుడూ కూడా నూనె రాయాలి. ఎందుకంటే నూనె రాయడం వల్ల జుట్టు  తేమగా ఉంటుంది. అందువల్ల జుట్టు పొడిబారిపోదు. అందుకే షాంపూతో తల స్నానం చేసే ముందు కొబ్బరి నూనె లేదా ఆలీవ్ ఆయిల్ తో మీ జుట్టుకి బాగా మసాజ్ చేయండి. ఆ తర్వాత షాంపూ చేస్తే జుట్టు షైనీగా మెరుస్తుంది.


అలాగే తల స్నానం చేసే ముందు షాంపూని నేరుగా తలపై పెట్టకుండా ముందు గోరు వెచ్చని నీటితో లేదా చల్లని నీటితో తలను మొత్తం కూడా తడపాలి.చాలా మంది కూడా షాంపూని నేరుగా తలపై రాస్తారు. ఇలా కాకుండా మీరు తీసుకునే షాంపూని కొద్దిగా మగ్గులో వేసి, వాటర్ వేసి బాగా నురగలా వచ్చేలా చేయాలి. ఇలా తల స్నానం చేస్తే మీ జుట్టు సిల్కీగా ఉండటమే కాకుండా.. పొడి బారకుండా చాలా సాఫ్ట్ గా ఉంటుంది.ఇంకా అలాగే మీ జుట్టుకి షాంపూని వాడేటప్పుడు ఖచ్చితంగా మీకు సరిపోయే దాన్ని ఎంచుకోండి.ఎందుకంటే ఎక్కువగా షాంపూ వేస్తే జుట్టు బలహీనమై, పొడిబారి పోతుంది. అందువల్ల త్వరగా జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. తలకు షాంపూ నురగ పోయేంత వరకూ నీటితో బాగా క్లీన్ చేయండి.ఈ టిప్స్ పాటిస్తే మీ జుట్టు సాఫ్ట్ గా పెరుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి.ఎల్లప్పుడూ కూడా హెల్తీ హెయిర్ ని మీ సొంతం చేసుకోండి.ఇంకా ఎలాంటి జుట్టు సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: