మనలో ఒక్కరికి కూడా చాలా అందంగా కనిపించాలనే కోరిక ఉంటుంది. అందుకే కొందరు స్కిన్ విషయంలో ఖచ్చితంగా చాలా కేర్ తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం వారి చర్మం విషయంలో కనీస జాగ్రత్తలు కూడా పాటించరు.దాని ఫలితంగా మొటిమలు, మచ్చలు, చర్మం కాంతి హీనంగా మారడం తదితర సమస్యలన్నీ తలెత్తుతుంటాయి. వీటన్నిటికి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు నియమాలను పాటించాలి. ఈ నియమాలను పాటిస్తే మీ చర్మం మేకప్ లేకపోయినా కానీ అందంగా, కాంతివంతంగా మెరుస్తుంది. మరి ఇంతకీ ఆ  నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పొద్దున్నే ముందుగా క్లెన్సర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత శుభ్రంగా ముఖాన్ని తుడుచుకుని సీరంను అప్లై చేసుకోవాలి.విటమిన్ సి నియాసినామైడ్ వంటి సీరం లను వాడితే చర్మ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.ఈ సీరం అప్లై చేశాక మీ స్కిన్ కు సూట్ అయ్యే మంచి మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.తరువాత చర్మానికి సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవాలి.చాలామంది వేసవి కాలంలోనే సన్ స్క్రీన్ ని వాడుతారు. అయితే సీజన్ తో సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా సన్ స్క్రీన్ ను ఖచ్చితంగా రాసుకోవాలి.అప్పుడే మన స్కిన్ హెల్తీగా ఉంటుంది.


ఇంకా అలాగే వీటితో పాటు నిత్యం శరీరానికి అవసరమయ్యే వాటర్ ను కూడా అందించాలి. మన బాడీ హైడ్రేటెడ్ గా ఉంటేనే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.ఇంకా అలాగే చర్మ ఆరోగ్యానికి మరో ముఖ్య వనరు నిద్ర. ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం మంది నిద్రని నిర్లక్ష్యం చేస్తున్నారు..అయితే మన కంటి నిండా నిద్ర లేకపోతే ఆరోగ్యమే కాదు చర్మం కూడా చెడిపోతుంది. మనం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు పడుకుంటే దాదాపు 90% రోగాలకు దూరంగా ఉండవచ్చు. అప్పుడు చర్మం కూడా చాలా నిగారింపుగా మెరుస్తోంది.ఖచ్చితంగా హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయాలి. సీజనల్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, హెర్బల్ టీలు, నట్స్ అండ్ సీడ్స్, తృణధాన్యాలు ఇంకా మొలకెత్తిన విత్తనాలు వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. స్వీట్స్, పంచదార, మైదా, నూనెలో వేయించిన ఆహారాలు, బేకరీ ఫుడ్స్ ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ కు చాలా దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ముఖం బాగా మెరిసిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: