దేశరాజధాని దిల్లీ లో బుద్దజయంతి పార్కు సమీపంలోని రిగ్జె రోడ్ ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాది స్థానికంగా ఐసిస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు మెరుపుదాడి చేసి ముష్కరుడిని అరెస్టు చేశాయి. ఉగ్రవాది నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.