ఏపీలో  విజృంభిస్తున్న కరోనా మహమ్మారి...  మరోసారి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు రాగా, గడచిన 24 గంటల్లో 92 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఏపీలో తాజాగా 61,300 శాంపిల్స్ పరీక్షించగా, 10,621 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు గుర్తించారు.