పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నా కూడా రాజకీయాలపై అసలు దృష్టి పెట్టలేదు అనుకోవడానికి లేదు అయన తన ఒక కన్ను ను రాజకీయాల్లో ఉంచి అంత గమనిస్తున్నారని అంటున్నారు.. అంతేకాదు పార్టీ ఎక్కడ వీక్ గా ఉందొ కూడా గుర్తించే పనిని మొదలుపెట్టారట.. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో బలమైన నియోజకవర్గాలను గుర్తించి అక్కడ సమర్ధులైన వారిని ఇంచార్జిలుగా నియమించాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అవడం శుభ పరిణామమే. అలాగే వారి ద్వారా ఇకపైన పార్టీ కార్యక్రమాలు పరుగులెత్తించాలని కూడా పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని అంటున్నారు.