టీడీపీ పార్టీ లో వర్గ విభేదాలు మొదలయ్యి అవి తార స్థాయికి చేరుకుంటున్నాయి.. వాటిని పరిష్కరించే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు ప్రయత్నించట్లేదో కానీ అవి పార్టీ పరువును మాత్రం మరింత దిగజార్చుతున్నాయి.. అసలే ఎన్నికల్లో ఓటమి తో పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో అని అందరు ఆందోళన చెందుతున్నట్లు అధికారంలో లేని పార్టీ లోని పదవులకోసం నేతలు ఇలా పోట్లాడుకోవడం , ఆధిపత్యం కోసం విమర్శలు చేసుకోవడం ఒక విధంగా వైసీపీ పార్టీ కి అనుకూలించే అంశమే..