దగ్గుబాటి వెంకటేష్ - రానా కాంబినేషన్ లో కూడా ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. రానా హీరోగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో వెంకీ ఓ సాంగ్ లో కనిపించి అలరించాడు. అప్పటి నుంచి బాబాయ్ - అబ్బాయ్ కాంబినేషన్ లో పూర్తి స్థాయి సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి మూవీ మొఘల్ రామానాయుడు వెంకీ - రానా లతో ఓ సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ మధ్య ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ కార్యక్రమం దాల్చలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా వీరి కాంబోలో మల్టీస్టారర్ చర్చల దశలో ఉందని.. సరైన స్క్రిప్ట్ కుదిరిన వెంటనే కలిసి నటిస్తామని పేర్కొన్నాడు.