టీ ఆర్ ఎస్ పార్టీ న గతంలో నమ్మినంతగా ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదు.. ఎందుకో తెలియదు కానీ గులాబీ నేతలపై ప్రజలు ఒక్కసారిగా నమ్మకం కోల్పోయారు. గడిచిన కాలంగా ప్రజలు టీ ఆర్ ఎస్ ను వదిలి బీజేపీ బాట పడుతున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది..  పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవకపోవడం, దుబ్బాక లో ఓటమి, ఇంకా గ్రేటర్ లో ఆశాజనక ఫలితాలు రాకపోవడం వంటివి చూస్తుంటే టీ ఆర్ ఎస్ కి గతంలో ఎప్పుడు లేని వ్యతిరేక త ప్రజల్లో నెలకొంది అని రుజువు అయ్యింది.. అయితే ఈ వరుస వైఫల్యాలు చూస్తుంటే కేసీఆర్ కి రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు..