సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబితే కేటీఆర్ తక్షణమే స్పందించి పరిష్కారాలను చూపిస్తూ ఉంటారు. తాజాగా ఒక సామాన్యుడు ట్విట్టర్ ద్వారా తన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని కోరగా మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించారు. 
 
కేబీఆర్ అడ్వకేట్ అనే వ్యక్తి ట్విట్టర్ లో "సార్ నమస్తే ...... నా కూతురు కొంతం నిషిక తన్మయి మొదటి పుట్టినరోజు మే 17 వేడుక ఎలాగో జరుపుకోలేను, కొత్త బట్టలు, కేక్ కూడా కొనలేను...నా కూతురు జీవితంలో మరిచిపోదు...... మీ ఆశీస్సులు అందించండి ప్లీజ్ సార్...... జీవిత కాలపు తీపి గుర్తు గా....." అని పోస్ట్ చేయగా కేటీఆర్ హ్యాపీ బర్త్ డే నిషిక తన్మయి అని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. మంత్రి కేటీఆర్ తండ్రి కోరిక మేరకు జీవితకాలపు తీపి గుర్తును ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: