ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచి బస్సులు రోడ్లెక్కాయి. చాలా రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కడంతో బస్టాండులలో ప్రయాణికుల సందడి నెలకొంది. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి ప్రయాణికులు బస్టాండ్ లకు చేరుకుంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. ఆన్ లైన్ లావాదేవీలపై అవగాహన ఉన్నవారు వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. 
 
మరికొంతమంది బస్టాండ్ లలో ఆర్టీసీచే నియమించబడిన వారి దగ్గర నుంచి టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. లాక్ డౌన్ లో ఆర్టీసీ బస్సులకు అధికారులు కొత్త రంగులు వేశారు. పలు జిల్లాల్లో పాత రంగులతోనే బస్సులు నడుస్తున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం కొత్త రంగులతో బస్సులు సందడి చేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు రోడ్లక్కడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: