ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. ఖరీఫ్ నుంచి రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత కరెంట్ అందిస్తామని తెలిపారు. పగటిపూట 9 గంటల ఉచిత కరెంట్ అందించేందుకు 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫీడర్లలో మార్పులు చేశామని అన్నారు. ఇప్పటికే 90 శాతం పగటిపూట విద్యుత్ అందించడానికి ఏర్పాట్లు జరిగాయని మిగిలిన 10 శాతం రబీలోపు పూర్తవుతుందని సీఎం అన్నారు. 
 
రాష్ట్రంలోని రైతులకు సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తామని తెలిపారు. రైతులకు ఉచితంగా పంటల బీమా కల్పిస్తున్నామని అన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజులలోపే రైతుల ఖాతాలలో నగదు జమ చేశామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతు సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: