కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై వాహనదారులకు పెట్రోల్ డోర్ డెలివరీ కానుంది. కేంద్రం త్వరలోనే చమురు కంపెనీలకు అనుమతులు ఇవ్వనుంది. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దేశంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ఆంక్షల వల్ల త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. ఇప్పటికే ముఖ్య నగరాల్లో డీజిల్ డెలివరీ అవుతుండగా పెట్రోల్, సీఎన్‌జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించేలా నూతన ఇంధన రిటైల్‌ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి తెలిపారు. 
 
11 రాష్ట్రాల పరిధిలో 56 నూతన సీఎన్‌జీ స్టేషన్లు నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 2018 సెప్టెంబర్‌ నుంచే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో డీజిల్‌ను మొబైల్‌ వ్యాన్‌ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) డెలివరీ చేస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం తగ్గింది. మరోవైపు రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ మద్దతుతో ఇండియన్ స్టార్టప్ రెపోస్ ఎనర్జీ, మొబైల్ పెట్రోల్ పంపుల సాయంతో ఇంటి వద్దకే పెట్రోల్ అందిస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: