జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, హీరోయిన్ మీరా చోప్రా మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. . ఇటీవ‌ల #askmeera చాట్ లో భాగంగా తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదంటూ మీరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీశాయి. కొంద‌రు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అస‌భ్య‌ప‌ద‌జాలం ఉప‌యోగించి విమర్శలు చేశారు. ఇటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఎలా నెగ్గుకురాగ‌ల‌రో తెలిపాలంటూ ఎన్టీఆర్ ను ప్రశ్నించారు. 
 
నటి పాయ‌ల్ ఘోష్ ఎన్టీఆర్ కు మద్దతు తెలుపుతూ ఆడ‌వాళ్ళ‌ని ఎన్టీఆర్ ఎలా గౌర‌విస్తారో చెప్పింది. బ్యాంకాక్‌లో ఒక సాంగ్ కోసం షూటింగ్ కు వెళ్లిన సమయంలో షూట్ లో భాగంగా డ్ర‌స్ మార్చవలసి వచ్చిందని... టీమ్ ఒక చిన్న గుడారాన్ని ఏర్పాటు చేయగా డ్రస్ ఛేంజ్ చేసుకున్నాన‌ని విషయం తెలిసి తారక్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడని చెప్పారు. రోడ్డు ప‌క్క‌న మ‌హిళ‌ దుస్తులు మార్చుకోవాల్సి రావ‌డం ఎన్టీఆర్ ను ఎంత‌గానో కలచివేసిందని.... అత‌డికి మహిళలను ఎలా గౌరవించాలో తెలుసు అంటూ పాయ‌ల్ ఘోష్ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: