సీఎం కేసీఆర్ నిన్న మంత్రులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రంలో న‌కిలీ విత్త‌నాలు అమ్మేవారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నకిలీ విత్తన వ్యాపారులు రైతు హంతకులని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. న‌కిలీ విత్త‌నాల విష‌యంలో ఎవ‌రినీ వ‌దిలిపెట్టేది లేద‌ని అన్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తానని చెప్పారు. 
 
నకిలీ విత్తనాల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.... నకిలీ విత్తనాలు అమ్మేవారి గురించి సమాచారం ఇస్తే 5,000 రూపాయల ప్రోత్సాహకం ఇస్తానని చెప్పారు. స‌మాచారం ఇచ్చిన వారి వివ‌రాల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. మరోవైపు తెలంగాణ సర్కార్ నిన్న రైతుబంధు మార్గదర్శకాలను విడుదల చేసింది. అర్హులకు ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున జమ చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: