ఇంటర్ ఫలితాలు విడుదల అవుతున్నాయి అంటే అటు విద్యార్థులకు ఎంత టెన్షన్ ఉంటుందో అటు విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అంత టెన్షన్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అయితే తల్లిదండ్రులకు తమ పిల్లల వ ఫలితాలు ఎలా ఉంటాయో అన్న  టెన్షన్ కంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే తమ పిల్లలు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతారో  అని  టెన్షన్ పడే పరిస్థితులు వచ్చాయి తల్లిదండ్రులకు. 

 

 తాజాగా మెదక్ జిల్లా చేగుంట లో ఇంటర్మీడియట్ ఫెయిల్  అవుతానేమో  అనే భయంతో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చేగుంట మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ బైపీసీ చదువుతున్న శిల్ప అనే విద్యార్థి... గత రెండు నెలల నుంచి ఫెయిల్ అవుతానేమో అనే  భయంతోనే తీవ్ర మనస్తాపం చెంచింది...  ఆ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: