ప్రపంచంలో ఈ మద్య కొత్త కొత్త వైరస్ లు మనుషులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో ఇప్పుడు కరోనా పేరు చెబితే గడ గడవణికిపోతున్నారు. అసలు కరోనాతో ఛస్తున్నాం రా బోబో అంటే చైనా నుంచి కొత్త కొత్త వైరస్ లు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో తాజాగా ఓ ఉడుతకు బుబోనిక్ ప్లేగు సోకింది. కొలరాడో రాష్ట్రానికి చెందిన ఆ ఉడుత .. బుబోనిక్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో హెల్త్ వార్నింగ్ జారీ చేశారు.
బుబోనిక్ ప్లేగు.. బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి. ఇది ఎలుకలు, ఉడుతల లాంటి జీవాల మీద వాలే ఈగలతో వ్యాప్తి చెందుతుంది. జూలై 11న మోరిసన్ పట్టణంలో జరిగిన పరీక్షలో ఓ ఉడుతకు ప్లేగు సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో సరైనా జాగ్రత్తలు పాటించకుంటే.. అది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని చైనా హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇటీవల చైనాలో ఇద్దరు అన్నాదమ్ముళ్లకు ఈ వ్యాధి సోకింది. జూలై 7వ తేదీన జరిగిన పరీక్షలో వారు పాజిటివ్‌గా తేలారు. ప్లేగు మళ్లీ పుట్టుకువచ్చిందని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, వణుకుడు, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా మంచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి