భూకబ్జా ఆరోపణలపై మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ తన సొంత హుజూరాబాద్‌కు బయల్దేరారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు ఈటల రాజేందర్‌ బయల్దేరారు. హైదరాబాద్‌లోని శామీర్‌పేటలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్‌తో తన సొంత నియోజకవర్గానికి పయనమయ్యారు. భారీ సంఖ్యలో కార్లతో అనుచరులు, మద్దతుదారులు ఆయన వాహనాన్ని అనుసరించారు. దీంతో జాతీయ రహదారి వెంబడి కోలాహల వాతావరణం నెలకొంది. దీంతో తుర్కపల్లి రాజీవ్‌ రహదారిపై పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో ఈటల అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఇక ఇప్పటికే తన రాజీనామాపై స్పందించిన ఈటల రాజీనామాకు ముందు తన నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతానని, వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: