తెలంగాణాలో హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఏ రేంజ్ లో హీట్ పెంచుతున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈటెల రాజేంద్ర ఈ ఎన్నికల్లో గెలవడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ లో వ్యాన్ల కొద్దీ మద్యాన్ని పంచుతున్నారు అని ఆయన విమర్శించారు. హరీశ్ రావు మార్కెట్లో వస్తువుల బదులు మనుషులను కొంటున్నారు అని అన్నారు.

టీఆరెస్ మీటింగ్ కు రాకపోతే పథకాలు రావు అని బెదిరిస్తున్నారు అని మండిపడ్డారు. వై.ఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మీద పోరాడింది నేనే అని గుర్తు చేసుకున్నారు. నేను సీఎం పదవి కోసం పోటీ పడలేదు అని అన్నారు. రెండు గుంటల భూమి ఉన్నోడు రెండు వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నాడు అని నిలదీశారు. కేసీఆర్ అక్రమ సంపాదనకు, అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts