మా ఎన్నిక‌ల్లో చిత్ర, విచిత్ర పోక‌డ‌లు చోటు చేసుకున్నాయి. ఉద‌యం పోలింగ్ ప్రాంగ‌ణానికి చేరుకున్న చిరు, ప‌వ‌న్ ఓటు హ‌క్కు వినియోగించుకుని, అక్క‌డి వారితో ముచ్చ‌టించారు. అదేవిధంగా మంచు కుటుంబ స‌భ్యులు మోహ‌న్ బాబు, విష్ణు, మ‌నోజ్ తో మాట్లాడారు. ముఖ్యంగా మంచు సోద‌రుల‌తో మాట్లాడి, యోగ క్షేమాలు తెలుసుకుని, వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నా రు. ఇవ‌న్నీ ఎన్నిక‌ల పోలింగ్ పై మంచి ప్ర‌భావం చూపింద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కౌగిలింత‌లే ఓ విధంగా కొంప ముంచ‌ను న్నాయ‌ని కూడా కొంద‌రు అంటున్నారు. కొన్ని ప‌రిణామాల నేప‌థ్యంలో విష్ణుకు గెలుపు సులువు అని అంటున్నారు. ప్ర‌కాశ్ రాజ్ కూడా కౌగిలింత‌ల‌పై ప్ర‌త్యేకంగా మాట్లాడ‌డం విశేషం. అయితే ఇదే సంద‌ర్భంగా వివిధ న‌గ‌రాల నుంచి వ‌చ్చి ఓటు వేసిన వారంతా త‌మ వైపే అని, ముప్పై నుంచి న‌ల‌భై ఓట్లు విష్ణుకే ప‌డ్డాయని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. జ‌య‌ప్ర‌ద‌, జెనీలియా, మాలాశ్రీ‌, అనుప మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ లాంటి నాయిక‌లు వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చి ఓటేశారు. అదేవిధంగా బాల‌య్య లాంటి అగ్ర హీరోలు విష్ణుకే మ‌ద్ద‌తు ఇచ్చారు. ఇవ‌న్నీ విష్ణుకే అనుకూలం అని తెలుస్తోంది. లోక‌ల్ , నాన్ లోక‌ల్ ఫ్యాక్ట‌ర్ కూడా బాగా ప‌నిచేసింద‌ని కూడా తెలుస్తోంది. ఇవ‌న్నీ విష్ణు విజ‌యానికి కార‌కం అవుతాయ‌ని న‌రేశ్ విశ్లేషిస్తున్నారు. కోట శ్రీ‌నివాస‌రావుపై నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లు కూడా ఎన్నిక‌పై ప్ర‌భావం బాగా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: