ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ కొద్దిసేప‌ట్లో జాతినుద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. భార‌త్ అత్యంత వేగంగా క‌రోనా టీకా డోసుల‌కు సంబంధించి 100 కోట్ల డోసులు పంపిణీ చేయ‌డంద్వారా కీల‌క మైలురాయిని చేరుకోవ‌డంతో ఆయ‌న మాట్లాడ‌నున్నారు. దేశంలో టీకాల పంపిణీ జ‌న‌వ‌రి 16వ తేదీన ప్రారంభ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు 70 శాతం మంది ప్ర‌జ‌ల‌కు ఒక డోసు, 31 శాతం మంది ప్ర‌జ‌ల‌కు రెండు డోసులు అందాయి. ప్ర‌జ‌లే ఇంకా టీకా వేయించుకోవ‌డానికి ముందుకు రావాల‌ని ప్ర‌భుత్వం కోరుతోంది. ప్ర‌పంచంలో చైనా త‌ర్వాత 100 కోట్ల టీకా డోసుల పంపిణీని చేరుకున్న దేశంగా భార‌త్ నిలిచింది. దీనికి సంబంధించి న‌రేంద్ర‌మోడీ ఇప్ప‌టికే వైద్య‌నిపుణుల‌కు, ఆరోగ్య రంగంలోని సిబ్బంది కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయ‌డంతోపాటు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇటువంటి మ‌హ‌త్త‌ర కార్యం భార‌త్‌వంటి దేశంలోనే సాధ్య‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. టీకాలు వేయించుకున్న‌ప్ప‌టికీ కొవిడ్‌కు సంబంధించిన నియ‌మ నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: