ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు తమ పరిధిలోని అర్హులైన వారి ధరఖాస్తులను పరిశీలించేందుకు ఈనెల 20వరకు పూర్తి చేయనున్నారు. నవంబర్ 23 వరకు జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల ఎంపికను జోనల్ సెలక్షన్ కమిటీలు పూర్తి చేస్తాయి. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు ఎంపికను రీజనల్ కమిటీలు ఈ నెల 25లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని ఎండీ తిరుమలరావు వెల్లడించారు.
ఎంపికైన వారికి నవంబర్ 27 లోపు వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ ఉద్యోగాలకు రీజనల్ మేనేజర్లు ఈనెల 30 వరకు నియామక ఉత్తర్వులు జారీ చేస్తారని వివరించారు. ఆ తరువాత శిక్షణ తరగతులు కూడ నిర్వహిస్తారు. కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అర్హులైనవారు లేకపోతే ఎక్స్గ్రేషియా అందించనున్నారు. అయితే క్లాస్–4 ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, నాన్గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.8 లక్షలు, గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి