ఒక పక్క పెట్రల్ ధరలు పెరిగి కనీసం లీటరు పెట్రోల్ కూడా కొనలేని పరిస్థితి. 96 , 97  రూపాయలు ఉన్న పెట్రోల్ ధర గడచినా నెలరోజులనుండి అక్టోబర్ వరకు పెట్రోల్ బాదుడు అంత ఇంతా కాదు. పెట్రోల్ ధర 113 రూపాయలకు చేరింది కేంద్ర ప్రభుత్వం తగ్గించిన వ్యాట్ తో 5 రూ.  తగ్గి ప్రస్తుతం 108 రూ. వద్ద లీటరు ధర కొనసాగుతోంది. సామాన్యుడు ఇన్ని బాధలు పడుతూ ఉంటే ఖమ్మం లోని ఓ పెట్రోల్ బ్యాంకు యజమాని  చేసిన నిర్వహానికి వినియోగదారుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఓ బైకర్ తనకు పది లీటర్ల పెట్రోల్ కొట్టించ వలసిందిగా 10 లీటర్ల కు డబ్బులు కట్టేశాడు. 


అయితే అతడు బండి పెట్రోల్ ట్యాంక్ ను పరిశీలించగా 10 లీటర్లు ఉండదని అనుమానం రావడంతో వెంటనే ఓ బక్కెట్ తీసుకువచ్చి పెట్రోల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ ని బక్కెట్ లో పట్టదు. బక్కెట్ లో ఉన్న పెట్రోల్ ని కొలిచినప్పుడు అది కేవలం ఐదు లీటర్లే ఉన్నట్లు అతడు గమనించాడు. వెంటనే ఆ పెట్రోల్ బంక్ ఎదుట ధర్నాకి దిగాడు. ఇలాంటి పరిస్థితి మున్ముందు ఏ వినియోగదారుడికి రాకూడదని కోరుతూ ఈ ధర్నా ని చేపట్టినట్లు తెలిపాడు. వెంటనే ఆ పెట్రోల్ బంక్ ని సీజ్ చేయవలసింది గా అతడు కోరినట్లు సమాచారం. పెట్రోల్ ని కొనడమే కష్టంగా మారుతున్న ఈ తరుణం లో ఇలాంటి చర్య చేపట్టడం ఎంతవరకు సమంజసం అని పెట్రోల్ బంక్ యజమానిని అతడు నిలదీసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: