ర్యాలీలో భాగంగా రైతులతో కలిసి రేవంత్‌రెడ్డి, సీనియర్ నేతలతో కలిసి ర్యాలీ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కదం తొక్కింది. రైతుల కోసం చేసే పోరాటంలో కాంగ్రెస్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలిపారు నేతలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగనాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు వ్యవసాయ శాఖ కమిషనర్ వినతి ప్రతం అందించేందుకు కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అనుమతి కేవలం 10 మందికి మాత్రమే ఉండడంతో కొంతమంది కాంగ్రెస్ నేతలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ ధర్నాలో భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేసీతక్క, సీనియర్ నాయకులు తదితరులు భారీ ర్యాలీకి హాజరయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి