ద‌క్షిణ బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉన్న‌ద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈనెల 27 వ‌ర‌కు తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్న‌ది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 22న  ఏర్పడిన ఉపరితల ఆవర్తనం..డ‌దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వివ‌రించింది.  దీని ప్రభావంతో రాబోయే  24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని  వెల్ల‌డించింది.

ఇప్ప‌టికే బుధ‌వారం తెలంగాణలో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు బలంగా వీస్తున్నాయి. అక్క‌డ‌క్క‌డ చిరు జ‌ల్లులు కూడా కురుస్తున్నాయి.  ఆకాశం పాక్షి కంగా మేఘావృతం అవ్వ‌డంతో పాటు.. ఈశాన్య దిశ ఉపరితల గాలు లు గంటకు ఆరు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గాలులు, మెరుపులు ప్రారంభం అయ్యాయి. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ న‌గ‌రంలో చిరుజ‌ల్లు వ‌ర్షం కురిసింది. దీని ప్ర‌భావంతో  ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైద‌రాబాద్‌ వాతావ‌ర‌ణ శాఖ  అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: