తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో 2009 డిసెంబ‌ర్ 9ని తెలంగాణ ప్ర‌జ‌లెవ్వ‌రు మ‌రిచిపోరూ. తెలంగాణ అస్థిత్వానికి గుర్తింపు ల‌భించిన రోజు, రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసి ప‌డుతున్న త‌రుణంలో కేంద్రం త‌ల‌దించ‌క త‌ప్ప‌ద‌ని భావించింది. తాను స‌చ్చుడో తెలంగాణ వ‌చ్చుడో.. అంటూ ప్ర‌స్తుత తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆమ‌ర‌న దీక్ష‌కు కూర్చొని బ‌లంగా మారి యావ‌త్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పే విధంగా చేసిన రోజు అని ఆర్థిక‌, వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తాజాగా ప్ర‌క‌టించారు. రాత్ర‌యినా.. తెలంగాణ‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని, చివ‌రికి రాత్రి 11.30 గంట‌ల‌కు తెలంగాణ‌కు అనుకూలంగా అప్ప‌టి కేంద్ర హోంమంత్రి చిదంబ‌రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసార‌ని గుర్తు చేసారు.
 
మంత్రి హ‌రీశ్‌రావు ఆనాటి రోజుల‌ను గుర్తు చేసుకుంటూ ట్విట్ట‌ర్ వేధిక‌గా ఇవాళ స్పందించారు. తెలంగాణ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన రోజు డిసెంబ‌ర్ 09 అని, ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టిన దీక్షాద‌క్షుడి నాయ‌క‌త్వంలో ఉద్య‌మం విజ‌య‌తీరాల‌కు చేరిన రోజు అని వెల్ల‌డించారు. అదేవిధంగా తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని స‌గ‌ర్వంగా నిలిపి రోజు అని, తెలంగాణ వ‌చ్చుడో.. కేసీఆర్ స‌చ్చుడో.. అని ఉద్య‌మ వీరుని ప్ర‌స్థానముకు నేటితో ప‌న్నేండేండ్లు అంటూ హ‌రీశ్‌రావు ట్వీట్ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: