ఏపీ సీఎం జగన్ ఏపీలో వైద్య సౌకర్యాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత ప్రజారోగ్యవ్యవస్థ పరంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి మరియు నంద్యాల జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు లేవన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ జిల్లాల్లో  2023 డిసెంబర్‌ నాటికి ఈ జిల్లాల్లో మెడికల్  కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించారు.


వీటిలో 2024 అడ్మిషన్లకు వాటిని సిద్ధం చేస్తామని కేంద్రానికి తెలిపారు. వీలైనంత త్వరగా ఈ కళాశాలలకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. పేదవాడు ఎక్కువగా ఖర్చు చేస్తున్నది ఇప్పుడు తిండి తర్వాత వైద్యానికే. పేదలకు పెద్ద జబ్బులొస్తే ఆ కుటుంబం కోలుకోవడం కష్టమే. అందుకే ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: