ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఏపీలో పాలిటెక్నిక్, ఐటీఐ విద్యా విధానం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను మరింత మెరుగు పరిచేందుకు అన్న అవకాశాలపై ఆయన అక్కడ అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆ దేశంలోని వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ పరిశ్రమను సందర్శించారు. ఆ పరిశ్రమలో వాడే టెక్నాలజీని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. జర్మనీలో అనుసరిస్తున్న ఒకేషనల్ ఎడ్యుకేషన్  విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ట్రైనింగ్ ఎలా ఇస్తారు.. విద్య, శిక్షణ ఎలా అమలు చేస్తారు అనే అంశాలను పరిశీలించారు. ద్వివిద్యా విధానం ద్వారా ఏపీలోని పారిశ్రామిక శిక్షణా విధానంలో సంస్కరణలు తీసుకువచ్చే అవకాశముందని.. ఈ పరిశ్రమను సందర్శించిన తర్వాత మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ పర్యటనలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి వెంట ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: