ఇది నందమూరి తారక రామారావు శత జయంతి సంవత్సరం. అందుకే ఈ ఏడాది అంతా ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్‌ కుటుంబం భావిస్తోంది. అందుకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలపై నందమూరి బాలకృష్ణ ప్రకటన చేశారు. మే 28న ప్రారంభమయ్యే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు 365 రోజులు జరుగుతాయని నందమూరి బాలకృష్ణ ఆ ప్రకటనలో తెలిపారు.

తమ కుటుంబం నుంచి నెలకొక్కరు ఒక్కో కార్యక్రమంలో పాల్గొంటారని నందమూరి బాలకృష్ణ వివరించారు. ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులు ఉంటాయని నందమూరి బాలకృష్ణ తెలిపారు. నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలు ప్రదానోత్సవం  ఉంటాయని.. తెనాలిలోని పెమ్మసాని థియేటర్ లో శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని నందమూరి బాలకృష్ణ వివరించారు. శక పురుషుని శత జయంతి పేరుతో వేడుకల నిర్వహిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: