తెలంగాణలో రియల్ ఎస్టేట్‌ బూమ్‌ మామూలుగా లేదు. తెలంగాణలో ప్రత్యేకించి వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో జోరు కనిపిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా ఆరు లక్షలకుపైగా లావాదేవీలు నమోదయ్యాయంటే.. రియల్ బూమ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.  తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతుండటమే ఇందుకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.


అందుకే తెలంగాణలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలకు రెక్కలొచ్చాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఎకరం కనీసం రూ.10 లక్షల వరకూ పలుకుతోంది. ఇక  హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో ఎకరం రేట్లు కోట్లలోనే ఉన్నాయి. హైదరాబాద్‌ సహా చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద సంఖ్యలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు  జరుగుతున్నాయి. ఈ కొనుగోళ్లు ఎంతగా పెరిగాయటం.. ఆరేళ్ల క్రితంతో పోలిస్తే అమ్మకాల్లో  రెండున్నర రెట్ల వృద్ధి కనిపిస్తోంది. భూమి నమ్మకమైన పెట్టుబడిగా జనం భావిస్తున్నారు. అలాగే లాభాలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అందుకే ఇంత బూమ్ ఉందని నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: