తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించి బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ పార్టీని గల్లీగల్లీకి తీసుకెళ్లేందుకు బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన అనే కార్యక్రమం రూపొందించింది. దేశ వ్యాప్తంగా 144 పార్లమెంట్ నియోజక వర్గాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని 17 నియోజక వర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. దీని ప్రకారం..  3, 4 పార్లమెంట్ నియోజక వర్గాలు కలిపి ఒక క్లస్టర్ గా రూపొందించి.. క్లస్టర్ ఇంఛార్జిలుగా కేంద్ర మంత్రులను నియమిస్తారు.


దీని ప్రకారం ఎంపిక చేసిన పార్లమెంట్ నియోజక వర్గాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు  రెగ్యులర్ గా పర్యటనలు చేస్తారు. నియోజక వర్గ పర్యటనకు వచ్చే ఎంపి మూడు రోజులు నియోజక వర్గంలోనే బస చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రచారం, విపక్షాలు కేంద్రంపై చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇస్తారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలోని గల్లీ గల్లీకి పార్టీని విస్తరించాలని బీజేపీ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp