తన మిత్ర దేశాలకు ఆయుధాలిస్తానంటూ రష్యా చేసిన ప్రకటన అమెరికాకు షాక్ ఇస్తోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో మాసంబంధాలకు రష్యా విలువ ఇస్తుందన్న పుతిన్‌.. మిత్ర దేశాలకు ఆధునిక ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. తగ్గేదే లేదని తెలిపారు. మాస్కోలో ‘ఆర్మీ-2022’ పేరుతో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనను ప్రారంభించిన సమయంలో పుతిన్‌ ఇలా మాట్లాడారు. 



రష్యాకు అధునాతన ఆయుధ సామర్థ్యాలు ఉన్నాయంటున్న పుతిన్‌.. అవసరమైతే ఆ టెక్నాలజీని మిత్ర దేశాలతో పంచుకోవడానికి సుముఖంగా ఉన్నామన్నారు. మిత్రదేశాలకు చిన్నపాటి ఆయుధాల నుంచి ఫిరంగులు, యుద్ధ విమానాల వరకు అత్యంత అధునాతన ఆయుధాలను అందించడానికి మేం రెడీ అంటూ పుతిన్‌ అమెరికాకు షాక్ ఇచ్చేశారు. రష్యా మిత్ర దేశాల్లో ఎక్కువగా అమెరికా శత్రు దేశాలే ఉంటాయన్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రకటనపై అమెరికా ఎలా స్పందిస్తునే విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: