కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా నిరసనలు చేపడుతున్నారు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామాలు దేశాలకు వెన్నుముకని అని చెప్పి గాంధీ పదే పదే అనేవారని సర్పంచులు గుర్తు చేస్తున్నారు. గ్రామంలో ఉన్న హక్కు అంతా కూడా సర్పంచ్ ఆధీనంలోనే నడవాలి అలాంటి సర్పంచుల హక్కులు ఈరోజు ఈ దురదృష్టకరమైన వైసీపీ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా హరించి పోయాయని సర్పంచులు విమర్శించారు.


సర్పంచులను ఒక బొమ్మలగా చేసి పక్కన పెట్టారని.. వాళ్ళ ప్రజాస్వామ్యంగా గెలిచినా గాని హక్కులు పూర్తిగా కాల రాసేసి  ఒక బొమ్మన వలె పక్కన పెట్టేశారని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ ఉద్యోగస్తులతోనే  అన్ని కార్యక్రమాలు నడపడం అనేది  చాలా దురదృష్టకరమని సర్పంచులు అంటున్నారు. ఏ హక్కు లేని సర్పంచ్ పదవి తమకు అనవసరం లేదని ఎంతోమంది వైసీపీ సర్పంచులు రాజీనామాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: