బీఆర్‌ఎస్ పార్టీ సర్కారుపై కాంగ్రెస్ మూడో చార్జీషీటు విడుదల చేసింది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి వ్యవసాయశాఖపై చార్జీషీటును విడుదల చేశారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసం జరిగిందని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కోటి ఎకరాల మాగాణి అనే కేసీఆర్ మాటలు ఓ బూటకమని...కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగ చేశారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.


సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయం కుదేలయిందని మహేశ్వర్ రెడ్డి  ఆరోపించారు. రైతుబంధు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలకు మంగళం పాడారని మహేశ్వర్ రెడ్డి  విమర్శించారు. రైతుబంధు భూస్వాములకు వరంగా ఉందని...కౌలు రైతులను పట్టించుకునే పాపాన పోలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ లేక రైతులు గోసపడుతున్నారని మహేశ్వర్ రెడ్డి  పేర్కొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని..  రైతు ఆత్మహత్యలను అవహేళన చేస్తూ ఓ సన్యాసిలా మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని మహేశ్వర్ రెడ్డి  డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: